అర్జెంటీనాలో ఉంటున్న పాకిస్తాన్ రాయబార కార్యాలయం తన సొంత ప్రభుత్వంపైనే సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి. అర్జెంటీనా, పాక్ మధ్య జేఎఫ్-17 విమానాల విషయంలో జరిగిన ఒప్పందాన్ని పాక్ కోల్పోయే ప్రమాదం ఉందని ట్వీట్ చేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది.
పాకిస్తాన్లో అధికార మార్పిడి జరిగితేనే ఆ దేశంపై ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయత నెలకొనే అవకాశాలున్నాయని కూడా ట్విట్టర్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వివాదం ముదురుతోందని గ్రహించిన ఆ రాయబార కార్యాలయం, వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని సింపుల్‌గా వ్యాఖ్యానించింది.