న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ (93) శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఐటీసీ హోటల్స్‌లో ఖురేషీ మాస్టర్ చెఫ్. 1931లో లక్నోలోని చెఫ్‌ల కుటుంబంలో జన్మించిన ఖురేషీ దమ్ ఫుఖ్త్ వంటకాన్ని పునరుద్ధరించినందుకు ప్రశంసలు అందుకున్నారు.
2015లో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సందర్భంలో బిర్యానీ అంటూ ఏదీ లేదని.. అన్నీ పులావ్‌లు మాత్రమేనని సంచలన కామెంట్స్ చేశారు ఖురేషీ. ఆయనే చెప్పుకున్నట్టు జీవితాంతం అత్యాశ లేకుండా నిజాయితీగా పనిచేశారు ఖురేషీ. ఆయన మృతి వార్త తెలుసుకున్న పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలిపారు.