ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం.. ఆ రాష్ట్రమే లూఠీ చేసిందా.!
ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం | హర్యానాలో లిక్విడ్ ఆక్సిజన్‌తో బయల్దేరిన ట్యాంకర్ మార్గమధ్యలో అదృశ్యమైంది. జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చండీగఢ్ : హర్యానాలో లిక్విడ్ ఆక్సిజన్‌తో బయల్దేరిన ట్యాంకర్ మార్గమధ్యలో అదృశ్యమైంది. జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పానిపట్ ప్లాంట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ నింపుకున్న ట్యాంకర్ బుధవారం సిర్సాకు బయల్దేరింది. గురువారం రాత్రి వరకు ట్యాంకర్ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అధికారులు ఫిర్యాదు చేసినట్లు పానిపట్‌లోని మాట్లౌడా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మంజిత్ సింగ్ తెలిపారు.
విషయంపై కేసు నమోదు చేసి ట్యాంకర్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో మెడికల్ ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇటీవల రాష్ట్రంలో ఇదే తరహా ఘటన జరగ్గా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
పానిపట్ నుంచి ఫరీదాబాద్‌లోని కొవిడ్ దవాఖానకు ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ ఢిల్లీ భూభాగంలోకి వెళ్లగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం లూఠీ చేసిందని ఆయన ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

