Paper Leak | ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణలు.. ఇంటర్ పరీక్షలు రద్దు
Paper Leak | ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మార్చి 21న జరుగాల్సిన హయ్యర్ సెకండరీ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ అయ్యింది.
గౌహతి: ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. (Paper Leak) ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మార్చి 21న జరుగాల్సిన హయ్యర్ సెకండరీ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు. మూడు ప్రభుత్వ విద్యాసంస్థలు సహా 18 స్కూల్స్‌లో ఉంచిన మ్యాథ్స్ పేపర్ సీల్ తీసి సోషల్ మీడియాలో లీక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అస్సాం హైయర్ సెకండరీ బోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది.
కాగా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దును అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు ధృవీకరించారు. షెడ్యూల్ పరీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రభుత్వ విద్యాసంస్థలతో సహా 18 స్కూల్స్‌లో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు. 10 జిల్లాల్లోని 15 ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపును బోర్డు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో మూడు స్కూల్స్‌పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 11వ తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను బోర్డు అధికారులు తర్వలో ప్రకటిస్తారని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మరోవైపు గత వారం, అస్సాంలోని బార్పేట జిల్లాలో 9వ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్షా పేపర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీక్‌పై పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డాయి. విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు రాజీనామా చేయాలని, బోర్డు చీఫ్ ఆర్సీ జైన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- board
- Cancels
- Class 11 Exam
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

