Vaccination | దేశంలో 70 కోట్లు దాటిన కరోనా టీకాల పంపిణీ
కరోనా టీకా | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 70 కోట్లమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 70 కోట్లమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు.
దేశంలో 10 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి 84 రోజులు పట్టిందని, 20 కోట్లకు చేరుకోవడానికి 45 రోజులు పట్టిందని తెలిపారు. ఈ సంఖ్య 30 కోట్లకు చేరుకోవడానికి మరో 29 రోజులు, 40 కోట్లకు పెరగడానికి 24 రోజులు పట్టిందన్నారు. ఇక ఆగస్టు 6 నాటికి 50 కోట్లకు చేరిందని, దానికి మరో 20 రోజులు తీసుకున్నదని వెల్లడించారు. 19 రోజుల్లోనే ఈ సంఖ్య 60 రోజులకు చేరిందని తెలిపారు. ఇది కేవలం 13 రోజుల్లోనే 70 కోట్లకు దాటిందని మంత్రి పేర్కొన్నారు.
ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 53,96,20,217 మంది మొదటి డోసు, 16,67,35,579 మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇందులో 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉన్నవారు 28,12,08,799 మంది మొదటిడోసు, 3,72,19,545 మంది రెండు డోసులు వేసుకున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమయ్యింది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక మార్చి 1న మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. ఇందులో 60 ఏండ్లు పైబడినవారికి, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడినవారికి, మే 1 నుంచి 18 ఏండ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

