కరోనాతో దేశంలో నిరుపేదలుగా మారిన 5.6 కోట్ల మంది: ప్రపంచ బ్యాంక్
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
న్యూఢిల్లీ: చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి. ఉపాధి లేకపోవడంతో కనీసం తినడానికి తిండి దొరకక చాలామంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పరిశ్రమలు ఖాయిళాపడటంతో లక్షల సంఖ్యలో మంది జీవోనపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం వంటి చాలా రకాల వ్యాపారాలు మందగించిపోవడంతో రోజువారీ కూలి చేసుకునేవారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. దీంతో 2020లో ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల 10 లక్షల మంది (71 మిలియన్లు) కడు పేదరికంలోకి జారుకున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఇందులో 79 శాతం మంది భారతదేశం నుంచే ఉన్నారని పేర్కొన్నది.

‘పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ 2022’ పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదికను రూపొందించింది. దీనిప్రకారం 2020 చివరినాటికి కరోనా కారణంగా దేశంలో 5 కోట్ల 60 లక్షల మంది కడు పేదరికంలోకి వెళ్లారని తెలిపింది. 2019లో 8.4 శాతంగా ఉన్న పేదరికపు రేటు.. 2020 నాటికి 9.3 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. కాగా, అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో పేదరిక స్థాయి పెరిగిందని చెప్పింది. అయితే ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న చైనాలో పేదల సంఖ్యలో పెద్దగా మార్పేమీ లేదని స్పష్టం చేసింది.

కన్జూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే (సీపీహెచ్ఎస్) గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. కాగా, 2011 నుంచి ప్రభుత్వాలు దేశంలో పేదరికానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించడంలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

