ఐఐటీల్లో 4596 టీచింగ్ పోస్టులు ఖాళీ.. ప్రకటించిన కేంద్రం
IIT | దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐటీలు. అత్యుత్తమ విద్యనందించి ఎంతోమందిని ఉన్నంతంగా తీర్చిదిద్దాల్సిన విద్యాసౌధాలు.. అధ్యాపకుల లేమితో క్రమంగా మసకబారుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐటీలు. అత్యుత్తమ విద్యనందించి ఎంతోమందిని ఉన్నంతంగా తీర్చిదిద్దాల్సిన విద్యాసౌధాలు.. అధ్యాపకుల లేమితో క్రమంగా మసకబారుతున్నాయి. టీచింగ్ పోస్టులు ఖాళీ అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం లేదు. దీంతో దేశంలోని మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో 4596 టీంచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ రాజ్యసభలో ప్రకటించింది.
అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 798 పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. ఇక ముంబై ఐఐటీలో 517, దేశంలోని టాప్ విద్యాసంస్థ అయిన ఐఐటీ మద్రాస్‌లో కూడా 482 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీలో 52, ఐఐటీ ధన్‌బాద్, రూర్కీ, కాన్పూర్, గువాహటిలో 300లకుపైగా టీచింగ్ పొజిషన్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇక కొత్తగా ఏర్పాటుచేసిన తిరుపతి ఐఐటీలో 15, పాలక్కాడ్ ఐఐటీలో 27 చొప్పున ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బీజేపీ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం పోస్టుల్లో 23,584 గ్రూప్-ఏ, 1,18,801 గ్రూప్-బీ, 8,36,936 గ్రూప్-సీ పోస్టులు ఉన్నాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

