Pakistani terrorists | జమ్మూలో 30 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు.. అప్రమత్తమైన భద్రతాబలగాలు..!
Pakistani terrorists | జమ్మూ ఏరియా (Jammu Area) లో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు (Pak terrorists) నక్కినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు (Security forces) అప్రమత్తమయ్యాయి.
Pakistani terrorists : జమ్మూ ఏరియా (Jammu Area) లో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు (Pak terrorists) నక్కినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు (Security forces) అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తుండటంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ విషయాన్ని సరిహద్దు భద్రతా దళం అధికారులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తమ దళాలు తిప్పికొడుతున్నాయని అన్నారు. సరిహద్దుల్లో ఉగ్ర కదలికల నేపథ్యంలో కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

