22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్

అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాల చెక్కుల్లో రూ.22 కోట్ల విలువైన 15 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఈ విషయం బయటపడింది. విరాళాల కింద ఇచ్చిన కొన్ని చెక్కులు చెల్లలేదు. కొన్నింటి బ్యాంకు ఖాతాల్లో ఆ మేరకు నిధులు లేకపోవడం, కొన్ని చెక్కులపై సంతకం సరిపోలకపోవడం, చెక్కులపై కొట్టివేతలు వంటి కారణాలతో మరికొన్ని బౌన్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చెక్కుల పొరపాట్లను సవరించేందుకు సంబంధిత బ్యాంకులను సంప్రదిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు.
అలాగే చెల్లని చెక్కుల గురించి ఆయా వ్యక్తులను సంప్రదించి కొత్త చెక్కులు ఇవ్వాలని కోరుతామని స్వామి గోవింద్ దేశ్ గిరి చెప్పారు. బౌన్స్ అయిన 15 వేల బ్యాంకు చెక్కుల్లో సుమారు రెండు వేల చెక్కులు అయోధ్య పరిధిలో వసూలు చేసినవి కాగా మిగతా 13 వేల చెక్కులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో వసూలు చేసినవి అని వివరించారు. కాగా, రామ మందిరం నిర్మాణం కోసం ట్రస్ట్, విశ్వహింద్ పరిషత్ సభ్యులు ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల వసూళ్ల కార్యక్రమంలో రూ.2,500 కోట్లకుపైగా వసూలైనట్లు ట్రస్ట్ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

