Doctor Assault: థానెలో డాక్టర్‌ను కొట్టిన పేషెంట్ కుమారుడు..
Doctor Assault: డాక్టర్‌పై దాడి ఘటన మరోసారి మహారాష్ట్రలో చోటుచేసుకున్నది. తాజాగా కళ్యాణ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌పై దాడి జరిగింది. ఆర్దోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్‌ను.. ఓ పేషెంట్ కొడుకు కొట్టాడు.
ముంబై: డాక్టర్‌పై దాడి(Doctor Assaulted) ఘటన మరోసారి మహారాష్ట్రలో చోటుచేసుకున్నది. ఇటీవల శివసేన కార్పొరేటర్ ఒకరు.. మహిళా డాక్టర్‌ను కొట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కళ్యాణ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌పై దాడి జరిగింది. ఆర్దోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్‌ను.. ఓ పేషెంట్ కొడుకు కొట్టాడు. దురుసుగా మాట్లాడటాన్ని డాక్టర్ వ్యతిరేకించాడు. దీంతో అతను మరింత కోపంతో అటాక్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు దాడి జరిగింది.
పక్కటెముక ఫ్రాక్చర్ అయిన ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడని, అతన్ని పరిశీలిస్తున్న సమయంలో.. బ్యాండేజ్ ఎలా వేసుకోవాలి, మెడిసిన్ ఎలా తీసుకోవాలని చెబుతున్న సమయంలో అతని కుమారుడు పదేపదే ప్రశ్నలు వేశాడని, చాలా అమర్యాదకరంగా మాట్లాడాడని డాక్టర్ యోగేంద్ర జైస్వాల్ తెలిపాడు. ఎందుకు అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో.. ఆ పేషెంట్ కుమారుడు ఎదురు తిరిగినట్లు డాక్టర్ చెప్పాడు. ఆస్పత్రి బయటకు వెళ్లి గట్టిగా అరుస్తున్న అతన్ని మందలించడంతో.. మళ్లీ లోపలికి వచ్చి దాడి చేసినట్లు డాక్టర్ తెలిపారు.
ఈ ఘటనకు చెందిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

