అఖిలపక్ష భేటీ : కన్వర్ యాత్ర వివాదం, నీట్ పేపర్ లీక్ అంశాలపై విపక్షం గరం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు కన్వయర్ యాత్ర వివాదం, నీట్ పేపర్ లీక్, లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి వంటి పలు అంశాలను లేవనెత్తాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు కన్వయర్ యాత్ర వివాదం, నీట్ పేపర్ లీక్, లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి వంటి పలు అంశాలను లేవనెత్తాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ్ గగోయ్, ఎస్పీ నేత కే సురేష్ హాజరయ్యారు.
ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, ఎస్పీ ఎంపీ రాం గోపాల్ యాదవ్, ఆప్ సంజయ్ సింగ్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సహా పలు పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లు, దుకాణాల యజమానుల పేర్లను ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అంశాన్ని ఎస్పీ, ఆప్ లేవనెత్తాయని సమాచారం.
లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించాలని, ఈ పదవిని ఖాళీగా ఉంచడం సమంజసం కాదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ సూచించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కేటాయించాలని ఎల్జేపీ, జేడీయూ డిమాండ్ చేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఎన్డీయే భాగస్వామ్యపక్షం టీడీపీ డిమాండ్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తప్పుపట్టారు. ఎన్నికల అనంతరం ఏపీలో చెలరేగుతున్న హింస, విపక్షంపై జరుగుతున్న దాడులపై ఈ సమావేశంలో వైసీపీ ప్రస్తావించింది.
Read More :
Bowenpally| బోయిన్‌పల్లిలో దారుణం.. భార్య, 10 నెలల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

