Army chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చాం: ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
Army chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కార్గిల్ యుద్ధ సంస్మరణం సందర్భంగా ద్రాస్‌లో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ద్రాస్: ఉగ్రవాదానికి సపోర్టు ఇస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సింధూర్‌తో స్పష్టమైన సందేశం ఇచ్చామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Army chief Upendra Dwivedi) తెలిపారు. కార్గిల్ యుద్ధ సంస్మరణం సందర్భంగా ద్రాస్‌లో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చామని, అలాగే పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్య అని ఆయన పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి భారత్‌కు తీవ్ర గాయాన్ని ఏర్పర్చిందని, అయితే ఈసారి ఇండియా బాధపడడమే కాదు, ఆ చర్యకు ప్రతీకార చర్యను కూడా చూపించిందన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న సందేశాన్ని ఇచ్చామన్నారు.
కార్గిల్ యుద్ధ వీరులను స్మరించేందుకు మూడు ప్రాజెక్టులను ఆర్మీ చీఫ్ ప్రారంభించారు. అమరులకు నివాళి అర్పించేందుకు ఈ-శ్రద్ధాంజలి పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధ గాధలు వినేందుకు క్యూఆర్ కోడ్ ఆడియో గేట్‌వేను కూడా ఆయన ప్రారంభించారు. ప్రతి ఏడాది జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్‌ను సెలబ్రేట్ చేస్తున్న విషయం తెలిసిందే. కార్గిల్ యుద్ధ వీరుల స్మారకాన్ని విజిట్ చేయకుండానే ప్రజల తమ హీరోలకు ఈ-శ్రద్ధాంజలి ప్రకటించవచ్చు. ప్రజల్లో ఆ నాటి యుద్ధ పరిస్థితులపై చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ-శ్రద్ధాంజలి ప్రారంభించారు.
ఇండస్ వ్యూవ్ పాయింట్ అనే ప్రాజెక్టును కూడా లాంచ్ చేశారు. దీని వల్ల విజిటర్స్ ఎల్వోసీ వద్దకు వెళ్లవచ్చు. బటాలిక్ సెక్టార్‌లోని ఎల్వోసీ ప్రాంతాన్ని ఇండస్ వ్యూవ్‌పాయింట్‌తో చూడవచ్చు. కార్గిల్ యుద్ధ సమయంలో బటాలిక్ ప్రాంతం కీలకంగా నిలిచింది. ఇది సుమారు పది వేల అడుగుల ఎత్తులో ఉంది. కార్గిల్, లేహ్, బల్టిస్తాన్ వ్యూహాత్మక లొకేషన్లో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

