ఉద్యోగం పేరుతో మహిళలకు వల.. 13 మందిపై లైంగిక దాడికి పాల్పడిన టెక్కీ
28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.
బెంగళూరు: ఒక టెక్కీ ఐటీ రంగంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళలను ఆకట్టుకున్నాడు. 13 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చర్యను మొబైల్లో రికార్డ్ చేసి తనతో సంబంధం కొనసాగించాలని వారిని బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఒక బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి హోటల్‌కు రప్పించి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ చర్యను రికార్డ్ చేసి వారిని లైంగికంగా వేధించసాగాడు. ఇలా 13 మంది మహిళలను ఆ టెక్కీ ట్రాప్ చేశాడు.
కాగా, జనవరి 26న ఒక బాధితురాలు సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దిలీప్ ప్రసాద్ చాలాకాలంగా ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఐటీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అతడ్ని అరెస్ట్ చేశారు. ఐటీ రంగంలో నిష్ణాతుడైన నిందితుడు మంచి జీతాన్ని కూడా అందుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru Techie
- jobs
- rapes
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

