న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తీరుపై కోవిడ్ వర్కింగ్ గ్రూపు చైర్మెన్ ఎన్కే అరోరా స్పందించారు. ఒమిక్రాన్ వల్లే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయని ఆయన అన్నారు. ఎక్స్ఈ లాంటి సిరీస్లో అదో ఎక్స్ వేరియంట్లా పనిచేస్తోందన్నారు. అయితే ఒమిక్రాన్ వల్ల కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తూనే ఉంటాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ మరీ అంత వేగంగా వ్యాప్తి కావడం లేదని ఆరోరా తెలిపారు.