న్యూఢిల్లీ : ఐఫా అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ నటి సోనం కపూర్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కు సంబంధించిన పాత వీడియో (Viral Vide) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైభవ్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
సోనం పెర్ఫామెన్స్‌పై నెటిజన్లు పెదవివరించారు. ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ క్లిప్‌లో లెహంగా ధరించిన సోనం ససురాల్ జెందా ఫూల్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అనిల్ కపూర్, బిపాసా బసు కూడా ఈ వీడియోలో కనిపించారు.
5 year old me performing at school function pic.twitter.com/ktHUGheVVj
— Vaibhav (@Crazen_forever) March 28, 2023
స్కూల్ పంక్షన్లో ఐదేండ్ల వయసులో నా పెర్ఫామెన్స్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సోనం పెర్ఫామెన్స్ పట్ల ట్విట్టర్ యూజర్లు పెద్దగా ఇంప్రెస్ కాలేదు. ఇది మీ పేరెంట్స్‌కే సంతోషం కలిగించే పెర్పామెన్స్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More