
న్యూఢిల్లీ: తన కొమ్ములతో బంతిని కొట్టి గోల్ చేసిన ఒక జింక అనంతరం సంబరాలు చేసుకున్నది. ఆనందంతో గెంతుతూ చిందులు వేసింది. రెండేండ్ల కిందటి నాటి వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక జింక తన కొమ్ములతో బంతిని గోల్‌పోస్ట్ వరకు నెట్టుకుని వస్తుంది. చివరకు కొమ్ములతో గట్టిగా బంతిని నెట్టి గోల్ చేస్తుంది. బంతిని గోల్‌లోకి తోసిన ఆనందంతో గెంతుతూ సంబరాలు జరుపుకుంటుంది.
12 సెకండ్ల నిడివి ఉన్న 2019 నాటి ఈ వీడియో మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కరోనా నేపథ్యంలో ఫుట్‌బాల్ క్రీడలు అంతగా జరుగని తరుణంలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఫుట్‌బాల్ ప్రేమికులను అలరిస్తున్నది.
No big deal; just a deer scoring a goal then celebrating… 😮 pic.twitter.com/AKhGIKSDF7
— Steve Stewart-Williams (@SteveStuWill) December 16, 2021