NAVEEN PATNAIK| ఒడిశా సీఎం అరుదైన ఘనత.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా రికార్డు
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
NAVEEN PATNAIK| భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉన్నది. ఆయన 1994 డిసెంబర్12 నుంచి 2019 మే 27 వరకు 24 ఏండ్లకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నవీన్‌పట్నాయక్.. 2000 మార్చి 5న తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 23 ఏండ్ల 138 రోజులుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు 1977 జూన్21 నుంచి 2000 నవంబర్ 5 వరకు 23 ఏండ్ల 137 రోజులపాటు పదవిలో కొనసాగారు. చామ్లింగ్, జ్యోతిబసు తర్వాత వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన మూడో నేత నవీన్ పట్నాయక్ కావడం విశేషం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించి పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయితే, అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

