Cholera in Odisha | ఒడిశాలో కలరా కలకలం.. ఆరుగురు మృత్యువాత
Cholera in Odisha | ఒడిశాలోని రూర్కెలాలో కలరా కలకలం రేగింది. ఆరుగురు మృత్యవాతపడటం ఆందోళన కలిగిస్తున్నది. కలరా ప్రబలినట్టు ల్యాబ్ పరీక్షల్లోనూ తేలడంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అతిసారం, వాంతులతో బాధపడుతున్న వందలాది మంది రూర్కెలాలోని పలు దవాఖానాల్లో చేరుతున్నారు.
భువనేశ్వర్, డిసెంబర్ 19: ఒడిశాలోని రూర్కెలాలో కలరా కలకలం రేగింది. ఆరుగురు మృత్యవాతపడటం ఆందోళన కలిగిస్తున్నది. కలరా ప్రబలినట్టు ల్యాబ్ పరీక్షల్లోనూ తేలడంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అతిసారం, వాంతులతో బాధపడుతున్న వందలాది మంది రూర్కెలాలోని పలు దవాఖానాల్లో చేరుతున్నారు. వ్యాధి లక్షణాలతో దాదాపు 500 మంది దవాఖానాల్లో చేరగా, అందులో ఆరుగురు చనిపోయారని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడి పరిస్థితిపై సీఎం పట్నాయక్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
‘కలరా, ఇ.కొలి ఉందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఓఆర్ఎస్ తీసుకోవాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్ని కోరాం’ అని ఇక్కడి ఆర్‌జీహెచ్ సూపరింటెండెంట్ సుధారాణి ప్రధాన్ తెలిపారు. సుందర్‌గఢ్, భువనేశ్వర్లలో డయేరియా, కలరాబారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించేందుకు అదనంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని తరలించారు. నగరంలో 36 చోట్ల తాగునీటి పైపుల లీకేజ్ ఉందని, కలరా, డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ఆహారం, నీటిని వైద్య సిబ్బంది పరీక్షిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

