JN.1 | 1,000 దాటిన జేఎన్.1 కేసులు.. 16 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్
JN.1 | ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ (Corona News variant) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెలన్నరలోపే ఈ వైరస్ ఏకంగా 50 దేశాలకు పాకింది. ఇక భారత్‌లోనూ కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.
JN.1 | ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ (Corona News variant) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెలన్నరలోపే ఈ వైరస్ ఏకంగా 50 దేశాలకు పాకింది. ఇక భారత్‌లోనూ కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో జేఎన్.1 (JN.1) కేసులు వెయ్యి దాటాయి. ఈ వైరస్ తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా పాకింది. దీంతో మొత్తం 16 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించినట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది.
ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 11వ తేదీ వరకూ దేశంలో 1,013 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా కర్ణాటకలో 214 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 170, కేరళలో 154, ఆంధ్రప్రదేశ్‌లో 189, గుజరాత్లో 76, గోవాలో 66, తెలంగాణలో 32, రాజస్థాన్‌లో 32, ఛత్తీస్‌గఢ్‌లో 25, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, ఉత్తరప్రదేశ్‌లో 6, హర్యానాలో ఐదు, ఒడిశాలో మూడు, పశ్చిమ బెంగాల్లో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసులు నమోదైంది.
మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
3,368కు చేరిన క్రియాశీల కేసులు
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,368 కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,412కి చేరింది. ఇక కరోనా వైరస్ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,44,84,162 మంది కోలుకున్నారు.
Also Read..
Houthis | నౌకలపై దాడులు ఆపబోము.. యూఎస్, యూకే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు : హౌతీ రెబల్స్
Sam Altman | బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్.. ఫొటోలు వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

