NPS Vatsalya | ఎన్పీఎస్ వాత్సల్య.. చిన్నారుల కోసం దీర్ఘకాలిక పొదుపు పథకం
బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని పరిచయం చేశారు.
- బడ్జెట్లో నూతన దీర్ఘకాలిక పొదుపు పథకం
NPS Vatsalya | న్యూఢిల్లీ, జూలై 23: బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని పరిచయం చేశారు. చిన్నారుల కోసం దీర్ఘకాలిక పొదుపును పెంపొందించడమే లక్ష్యంగా ఈ మైనర్ పెన్షన్ స్కీంను తెచ్చినట్టు మంత్రి తన ప్రసంగంలో తెలియజేశారు. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్యలో చేరవచ్చని చెప్పారు.
ఏమిటీ ఎన్పీఎస్ వాత్సల్య పథకం?
భవిష్యత్తులో తమ పిల్లలకు ఆర్థికపరమైన భద్రతను కల్పించాలని యోచించే తల్లిదండ్రులు, కుటుంబాలే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రస్తుత నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో భాగంగానే ఈ వాత్సల్య పథకాన్నీ కేంద్రం తీసుకొచ్చింది. ఎన్పీఎస్లోని ఇతర ప్లాన్ల తరహాలోనే ఇదీ ఉంటుంది. తమ చిన్నారుల రేపటి కోసం తల్లిదండ్రులు, వారి సంరక్షకులు ఖాతాలను తెరిచి, అందులో కొంత మొత్తాలను మదుపు చేసుకోవచ్చు.
రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా..
పిల్లలకు 18 ఏండ్లు వచ్చాక, ఈ వాత్సల్య పథకాన్ని రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా మార్చుకునే సౌకర్యం ఉన్నది. అలాగే నాన్-ఎన్పీఎస్ ప్లాన్‌గా కూడా మార్చుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రిటైర్మెంట్ నిధి ఏర్పాటుకు, క్రమపద్ధతిలో పొదుపు, పెట్టుబడులను అలవర్చుకోవడానికి ఈ పథకం దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, స్టాక్స్, బాండ్లు తదితర మార్కెట్ ఆధారిత సాధనాల్లోకి ఎన్పీఎస్ నిధులు పెట్టుబడులుగా వెళ్తాయి. కాబట్టి ఇవి ఒకింత రిస్క్‌తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్స్గానే భావించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వంటి సంప్రదాయ ఆదాయ మార్గాలతో పోల్చితే అధిక రాబడులను ఇస్తుండటం కలిసొచ్చే అంశం.
పెన్షన్ స్కీం ఆకర్షణీయం
కొత్త పన్ను విధానంలో నేషనల్ పెన్షన్ స్కీంను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ట్యాక్స్ డిడక్షన్‌ను 14 శాతానికి పెంచారు. కంపెనీల కంట్రిబ్యూషన్‌పై పన్ను కోతలను 10 శాతం నుంచి 14 శాతానికి తెస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఉద్యోగులు, కంపెనీల యాజమాన్యాలకు పన్ను ప్రయోజనాలను పెంచేందుకే ఈ నిర్ణయమన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

