ఇండోర్, మే 4: 1 లేదా 2 కేజీల వరకు బరు వు తూకే మామిడి పండు ను మనం చూసుంటాం. అయితే మధ్యప్రదేశ్లో పండే నూర్జహాన్ రకానికి చెందిన మామిడి ఒక్కోటి 4 కేజీలకు పైగా కాస్తుంది.
ఇది వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు అమ్ముడుపోతుంది. అఫ్గానిస్థాన్లో పుట్టిన ఈ ప్రత్యేక రకానికి చెందిన మామిడి చెట్లు మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ జిల్లా కత్తివాడ ఏరియాలో తక్కువ సంఖ్యలో మాత్రమే కనబడుతాయి.