రెప్పపాటులో కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్.. అన్ని జాగ్రత్తలతో పేల్చివేసిన అధికారులు
నోయిడా: నోయిడాలో ట్విన్ టవర్స్‌ను అధికారులు కూల్చివేశారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ బహుళ అంతస్తుల భవనాలను కూలగొట్టారు.
ముందే అమర్చి ఉంచిన 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఒక్కసారిగా పేల్చివేయడంతో 48 అంతస్తుల ఎత్తున్న భవనాలు కేవలం 9 సెకన్లలో పేక మేడలా కూలిపోయాయి.
ట్విన్ టవర్స్‌లోని అన్ని అంతస్తులను ఏకకాలంలో పేల్చివేయడంతో శిథిలాలు పక్కకు ఎగిరిపడకుండా భవనాల అడుగు భాగంలోనే ఒకేచోట పోగుపడ్డాయి. పేలుడు సమయంలో దట్టంగా దుమ్ము ధూళి వెలువడింది. భవనాలు నేలమట్టమైన కొన్ని క్షణాల్లోనే పరిసర ప్రాంతాలకు దుమ్ము కప్పేసింది. ఎంతలా అంటే కొన్ని నిమిషాలపాటు కూలిన ట్విన్ టవర్స్ పరిసరాల్లో దుమ్ము ధూళి తప్ప ఏమీ కనిపించలేదు.
నోయిడా ట్విన్ టవర్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కొన్నేండ్లుగా వివాదం కొనసాగింది. చివరకు నిర్మాణ నియమాల ఉల్లంఘన జరిగిందని తేలడంతో ట్విన్ టవర్స్‌ను కూల్చివేశారు. పేల్చివేతకు ముందు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చుట్టూ 450 మీటర్ల పరిధిలో పరిసరాలను అధికారులు తమ పర్యవేక్షణలోకి తీసుకున్నారు.
భారీగా పోలీసులను, సహాయక బృందాలను మోహరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తుతుందేమోనని ముందుజాగ్రత్తగా ఫైరింజన్లు, అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. కానీ ఎలాంటి అవసరం లేకుండా అనుకున్న సమయానికి సజావుగా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తయింది.
#WATCH उत्तर प्रदेश: नोएडा के सुपरटेक ट्विन टावरों को गिराया गया। pic.twitter.com/c5895lgn2Q
— ANI_HindiNews (@AHindinews) August 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

