Samrat Choudhary | సీటు ఖాళీ లేదు.. సీఎంగా బాధ్యతలు అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి
Samrat Choudhary | బీహార్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Samrat Choudhary | బీహార్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక ప్రస్తుతం బీహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
అయితే, ఈ సారి ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీశ్ కుమార్ని తప్పించి బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి (Samrat Choudhary) ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సామ్రాట్ చౌదరి తాజాగా స్పందించారు. ప్రస్తుతం బీహార్లో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలపై వస్తున్న ప్రచారం గురించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. ‘ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదు’ (No Vacancy) అని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.
Also Read..
UPI | అక్టోబర్లో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. పూర్ కేటగిరీలో ఏక్యూఐ
Prashant Kishor | ప్రజలు విశ్వసిస్తే 150 సీట్లు.. లేదంటే 10 కంటే తక్కువే : ప్రశాంత్ కిషోర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

