ఆ రెండు టవర్లనూ కూల్చాల్సిందే.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
రియాల్టీ సంస్థ సూపర్‌టెక్ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నోయిడాలో తాము నిర్మించిన రెండు 40 అంతస్తుల టవర్లను కూల్చేయాల్సిందిగా గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ సూపర్‌టెక్ వేసిన పిటిషన్‌ను సోమవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.

న్యూఢిల్లీ: రియాల్టీ సంస్థ సూపర్‌టెక్ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నోయిడాలో తాము నిర్మించిన రెండు 40 అంతస్తుల టవర్లను కూల్చేయాల్సిందిగా గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ సూపర్‌టెక్ వేసిన పిటిషన్‌ను సోమవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. రెండు టవర్లను కూల్చడం కంటే ఒక టవర్లోని 224 ఫ్లాట్లను, వాటి కమ్యూనిటీ ఏరియాను కూల్చేస్తామని తన పిటిషన్లో సూపర్‌టెక్ తెలిపింది. అయితే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం అంగీకరించలేదు. ఇతర అప్లికేషన్లు లేదా స్పష్టత కోసం వేసిన అప్లికేషన్ల రూపంలో ఉన్న ఈ పిటిషన్ తీర్పుపై సమీక్ష కోరకూడదంటూ దీనిని కొట్టేసింది.
తమ టవర్-17 ఇతర నివాస ప్రాంతాల పక్కనే ఉన్న కారణంగా దానిని పేలుడు పదార్థాల సాయంతో పేల్చడం కుదరదని, ఒక్కో ఇటుక లెక్కన కూల్చాలంటే చాలా ఖర్చవుతుందని తన పిటిషన్లో సూపర్‌టెక్ తెలిపింది. ఇప్పటికే ఈ టవర్ల నిర్మాణానికి భారీగా ఖర్చయిందని, అందుకే మరింత ఖర్చును అడ్డుకోవడం కోసమే తాము తీర్పుపై సమీక్ష కోరినట్లు తెలిపింది. ఈ రెండు టవర్లు నోయిడా భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వాటిని కూల్చేయాల్సిందే అంటూ ఆగస్ట్ 31న తీర్పు వెలువరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

