Navneet Rana | మోదీ వేవ్ లేదన్న బీజేపీ అభ్యర్థిని నవనీత్ రాణా.. నిజమేనన్న ప్రతిపక్ష కూటమి
Navneet Rana | మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవనీత్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మోదీ వేవ్’ లేదని ఆమె అన్నారు.
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవనీత్ రాణా (Navneet Rana) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మోదీ వేవ్’ లేదని ఆమె అన్నారు. ‘గ్రామపంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఓటర్లందరినీ బూత్‌కు రప్పించి ఓటు వేయాలని చెప్పాలి. మోదీ వేవ్ ఉందన్న భ్రమల్లో ఉండొద్దు. 2019లో మోడీ వేవ్ ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలిచా’ అని అన్నారు.
కాగా, వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి అయిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) స్పందించింది. నవనీత్ రాణా నిజం మాట్లాడిందని ఎన్సీపీ (ఎస్పీ) అధికార ప్రతినిధి మహేశ్ తపసే అన్నారు. ఓటర్ల మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. అందుకే ఇతర పార్టీల నేతలను బీజేపీ చేర్చుకుంటోందని విమర్శించారు.
మరోవైపు శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కూడా దీనిపై స్పందించారు. ‘మోదీ వేవ్‌ను మర్చిపోండి. మోదీ తన సీటును గెలుచుకుంటారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నే. దేశవ్యాప్తంగా బీజేపీకి 45 సీట్లు మాత్రమే వస్తాయని మా పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే చెప్పారు. బీజేపీ సొంత అభ్యర్థులు కూడా నిజం మాట్లాడుతున్నారు. బహిరంగంగా, బిగ్గరగా ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు’ అని అన్నారు.
BJP Amravati candidate Navneet Rana on Monday claimed there was no ‘Modi wave’.
“We will have to fight this election as if it were a gram panchayat election. We will have to bring all the voters to the booth by noon and tell them to vote. This time, There is no Modi wave”
BJP… pic.twitter.com/XY0fgsj3Oj
— Mahua Moitra Fans (@MahuaMoitraFans) April 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- mva
- navneet rana
- No Modi wave
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

