Narendra Singh Tomar | సాగు చట్టాలను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశం లేదు: తోమర్ యూటర్న్
Narendra Singh Tomar | నూతన సాగు చట్టాల విషయంపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యూటర్న్ తీసుకున్నారు. సాగు చట్టాలను మళ్లీ

Narendra Singh Tomar | నూతన సాగు చట్టాల విషయంపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యూటర్న్ తీసుకున్నారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తామని నిన్ననే ఢంకా బజాయించి మరీ ప్రకటించారు. 24 గంటలైనా తిరగక ముందే ఆదివారం మళ్లీ మాట మార్చేశారు. రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ రైతులను గందరగోళంలోకి నెట్టేస్తోందని, ఈ గందరగోళంలో రైతులు ఇరుక్కోవద్దని వ్యాఖ్యానించారు.’రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశం మాకు లేదు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి కాంగ్రెస్ ఈ విషయంలో రైతులను గందరగోళంలోకి నెట్టేస్తోంది. రైతులెవ్వరూ ఈ గందరగోళంలో ఇరుక్కోవద్దు’ అని తోమర్ అన్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యానే ప్రధాని మోదీ సాగు చట్టాలను రద్దు చేశారని తోమర్ గుర్తు చేశారు.
సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తాం… నాగపూర్లో ప్రకటన
నాగపూర్ వేదికగా శనివారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు చట్టాలను రద్దు చేయడం అంటే ఒక్క అడుగు మాత్రమే వెనక్కి వేసినట్లని, మళ్లీ వాటిని తీసుకొస్తామని తోమర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. వ్యవసాయాన్ని గాడిలో పెట్టడానికి తాము కొన్ని చట్టాలను తెస్తే, అవి కొందరికి రుచించడం లేదని మండిపడ్డారు. రైతులే ఈ దేశానికి వెన్నెముక అని, ఆ వెన్నెముక బలపడితే దేశం దానంతటదే ముందుకు సాగుతుందని తోమర్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

