పీఎల్ఏను తరిమికొట్టాం.. ఒక్క జవాను చనిపోలేదు: రాజ్‌నాథ్
Rajnath singhఅరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆ ఘర్షణలో ఒక్క సైనికుడు కూడా మృతిచెందలేదని, ఒక్కరు కూడా తీవ్రంగా గాయపడలేదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టర్లో
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆ ఘర్షణలో ఒక్క సైనికుడు కూడా మృతిచెందలేదని, ఒక్కరు కూడా తీవ్రంగా గాయపడలేదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టర్లోని యాంగ్జి ప్రాంతంలో చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని, ఆ దళాలు ఆక్రమణకు పాల్పడినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. చైనా దళాలు చేసిన ప్రయత్నాల్ని మన సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆయన చెప్పారు.
భూభాగాన్ని ఆక్రమించకుండా పీఎల్ఏను మన సైనికులు ధైర్యంగా అడ్డుకున్నట్లు మంత్రి తెలిపారు. చైనా సైనికులను విజయవంతంగా తమ పోస్టు నుంచి వెళ్లగొట్టారన్నారు.చైనా ప్రభుత్వంతో ఈ అంశం గురించి దౌత్యపరమైన పద్ధతిలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. సరిహద్దుల్ని రక్షించేందుకు మన దళాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఎవరైనా మన భూభాగంలోకి ప్రవేశించాలని చూస్తూ వాళ్లను సమర్థవంతంగా అడ్డుకుంటామన్నారు.
పీఎల్ఏతో జరిగిన ఘర్షణలో ఇరు వైపులకు చెందిన దళాలకు స్వల్ప గాయాలైనట్లు రాజ్‌నాథ్ తెలిపారు. మన సైనికుల్లో ఒక్కరు కూడా చనిపోలేదని, తీవ్రంగా గాయపడలేదన్నారు. భారతీయ మిలిటరీ కమాండర్లు సరైన సమయంలో జోక్యం చేసుకోవడం వల్ల… పీఎల్ఏ దళాలు వెనక్కి వెళ్లినట్లు మంత్రి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

