Home
National
No Better Service Than Blood Donation To Celebrate Indias 75 Years Says Aiims Director Randeep Guleria
రక్త దానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదు: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

న్యూఢిల్లీ: రక్త దానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఢిల్లీలో CISF ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి రక్తదానం కంటే మెరుగైన సేవ ఏదీ లేదు. ఇప్పటివరకు దాదాపు 1500 మంది రక్త దానం చేశారు’ అని గులేరియా అన్నారు. ఈ రక్త దాన శిబిరం ఆగస్ట్ 15 వరకు కొనసాగుతుందని చెప్పారు. రక్త దానం కోసం మరింత మంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో కరోనా థర్డ్ వేవ్‌ను నివారించడానికి ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని రణదీప్ గులేరియా సూచించారు. కరోనా టీకాలు తీసుకోవడం, మాస్క్‌లు ధరించడం ఎంతో ముఖ్యమన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

