విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీలపై ఎన్ఎంసీ అస్పష్ట వైఖరి!
భారత్‌లో వైద్య వృత్తిని చేపట్టడానికి విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీల చెల్లుబాటుపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ‘అస్పష్ట’ వైఖరిని అనుసరిస్తున్నది. విదేశాల్లో ఎంబీబీఎస్ డిగ్రీలను అభ్యసించేలా విద్యార్థులను ‘తప్పుదోవ’ పట్టించేందుకు కన్సల్టెంట్లు ఇది అవకాశం కల్పిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో కుమ్మక్కైన కన్సల్టెంట్లు విద్యార్థులను మభ్యపెట్టి వారి నుంచి భారీ కమీషన్లు వసూలు చేస్తున్నారని న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు.
- కమీషన్ పేరుతో విద్యార్థుల నుంచి కన్సల్టెంట్ల భారీ వసూళ్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత్‌లో వైద్య వృత్తిని చేపట్టడానికి విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీల చెల్లుబాటుపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ‘అస్పష్ట’ వైఖరిని అనుసరిస్తున్నది. విదేశాల్లో ఎంబీబీఎస్ డిగ్రీలను అభ్యసించేలా విద్యార్థులను ‘తప్పుదోవ’ పట్టించేందుకు కన్సల్టెంట్లు ఇది అవకాశం కల్పిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో కుమ్మక్కైన కన్సల్టెంట్లు విద్యార్థులను మభ్యపెట్టి వారి నుంచి భారీ కమీషన్లు వసూలు చేస్తున్నారని న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు.
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) అర్హతా ప్రమాణాలను నెరవేర్చే దేశాలు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల జాబితాను ప్రచురించి విద్యార్థులు అటువంటి మోసాల బారిన పడకుండా కాపాడాలని నిపుణులు ప్రభుత్వాన్ని, ఎన్ఎంసీని కోరారు. జార్జియాలో ఆరేండ్ల ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయడం వల్ల భారత్‌లో వైద్య వృత్తిని చేపట్టేందుకు ఎఫ్‌ఎంజీఈకి హాజరయ్యేందుకు తమకు అర్హత లభిస్తుందా, లేదా అనే విషయమై వైద్యులు కావాలనుకుంటున్న ఇద్దరు విద్యార్థులు పీఎం గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా స్పష్టత కోరారు. సెప్టెంబర్ 24న ఇచ్చిన మొదటి జవాబులో ఎన్ఎంసీ తన 2021 నాటి నిబంధనలను పునరుద్ఘాటించింది.
ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వైద్య వృత్తిని అభ్యసించడానికి జార్జియా స్వతంత్ర లైసెన్స్ మంజూరు చేస్తేనే భారత్‌లో ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరయ్యేందుకు ఆ డిగ్రీ చెల్లుబాటు అవుతుందని ఎన్ఎంసీ పేర్కొంది. మరో అభ్యర్థి సమర్పించిన అదే తరహా ప్రశ్నకు అక్టోబర్ 13న ఇచ్చిన తన రెండో సమాధానంలో స్వతంత్ర లైసెన్సింగ్ వ్యవస్థకు సంబంధించిన నిబంధనలను సంబంధిత అధికార వ్యవస్థ, నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నాయని ఎన్ఎంసీ పేర్కొంది. ఎన్ఎంసీ కార్యదర్శి రాఘవ్ లాంగర్‌కు పీటీఐ లేఖ రాసి వివరణ కోరినప్పటికీ ఆయన స్పందించలేదు. విదేశీ వర్సిటీల నుంచి భారీ కమీషన్లు పొందుతున్న కన్సల్టెంట్లు ఈ విషయం పరిశీలనలో ఉంది అన్న రెండో సమాధానాన్ని ఉటంకిస్తూ విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు అని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది సచిన్ జైన్ అన్నారు. స్వతంత్ర లైసెన్స్ నిబంధనను రద్దు చేస్తామని, లేదా వివిధ ఇతర యంత్రాంగాల ద్వారా తప్పిస్తామని, తద్వారా విద్యార్థులు ఎఫ్ఎంజీఈ పరీక్షకు హాజరై భారత్‌లో వైద్య వృత్తిని చేపట్టగలరని వారు బూటకపు హామీలు ఇస్తున్నారని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

