Toll Rates: హైవే టోల్ రేట్లు పెంపు.. దేశవ్యాప్తంగా అమలులోకి కొత్త ధరలు
Toll Rates: ఇవాళ్టి నుంచి కొత్త టోల్ రేట్లు అమలులోకి వచ్చేశాయి. దేశవ్యాప్తంగా టోల్ రేట్లు సగటును అయిదు శాతం పెరిగినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది.
న్యూఢిల్లీ: భారత జాతీయ రహదారి సంస్థ టోల్ రేట్ల(Toll Rates)ను పెంచిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చేశాయి. దేశవ్యాప్తంగా టోల్ రేట్లు సగటును అయిదు శాతం పెరిగినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ప్రతి ఏడాది జరిగే పెంపులో భాగంగానే ఈ ఏడాది కూడా టోల్ ప్లాజాల వద్ద ట్యాక్సులను పెంచినట్లు ఆ సంస్థ పేర్కొన్నది. వాస్తవానికి ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త టోల్ రేట్లను అమలులోకి తెస్తారు. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. టోల్ ధరలను ఇవాళ్టి నుంచి పెంచేశారు. ఈ ఏడాది సగటున అయిదు శాతం మేర టోల్ రేట్లను పెంచినట్లు అధికారులు చెప్పారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను వాడే వాహనదారులు సోమవారం నుంచి అధిక టోల్ రేట్లను చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. దీంట్లో 675 పబ్లిక్ ఫండ్ ప్లాజాలు కాగా, మరో 180 ఇతర చేతుల్లో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

