NHAI | ఇక హైవేలపై జర్నీ సేఫ్..! ఎన్హెచ్ఏఐ, రిలయన్స్ జియో మధ్య కీలక ఒప్పందం..!
NHAI | దేశంలోని హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణం సురక్షితంగా మార్చే లక్ష్యంతో కొత్త మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నది.
NHAI | దేశంలోని హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణం సురక్షితంగా మార్చే లక్ష్యంతో కొత్త మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఎంవోయూ ప్రకారం.. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, పొగమంచు, రోడ్లపైకి పశువులు, సడెన్ డైవర్షన్స్ వంటి ప్రమాదకర ప్రాంతాల సమాచారం ఇకపై నేరుగా మొబైల్‌కు పంపనున్నారు. ఈ వ్యవస్థతో కొత్తగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం వ్యవస్థ జియో ప్రస్తుత 4జీ, 5జీ టెలికాం ఫెసిలిటీపై ఆధారపడి నడుస్తుంది. ప్రయాణికులు ఎస్ఎంఎస్, వాట్సాప్, హై ప్రయారిటీ కాల్స్ ద్వారా ముందస్తు హెచ్చరికలు స్వీకరిస్తారు. దాంతో ప్రయాణికులు తమ వాహనాల వేగాన్ని తగ్గించడంతో పాటు ప్రమాదకరమైన ప్రాంతాల్లో జాగ్రత్తగా నడిపేందుకు అవకాశం ఉంటుంది.
ఈ సర్వీస్‌ని క్రమంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, హైవేయాత్ర యాప్, నేషనల్ హైవే ఎమర్జెన్సీ నంబర్ 1033తో అనుసంధానిస్తారు. ఈ ఆటోమేటిక్ అలర్ట్ సిస్టమ్ తొలి దశ ఎంపిక చేసిన ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్నది. ఈ ట్రయల్స్ ప్రమాద ప్రదేశాలను గుర్తించడంతో పాటు వారికి ఎలాంటి హెచ్చరికలు పంపాలో నిర్ణయిస్తారు. ఆ తర్వాత జాతీయ రహదారి నెట్‌వర్క్‌కు విస్తరిస్తారు. ఇప్పటికే ఉన్న అన్ని నిబంధనలు, డేటా ప్రొటెక్షన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉంటుందని హైవేస్ అథారిటీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర టెలికాం కంపెనీలు కూడా ఈ వ్యవస్థలో చేర్చనున్నారు. ఎన్హెచ్ఏఐ, జియో మధ్య ఈ ఎంవోయూ జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా కీలకమైన ముందడుగని.. ఇకపై ఎలాంటి అదనపు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేకుండానే ఆయా రోడ్లపై డ్రైవర్లు రియల్ టైమ్ ద్వారా హెచ్చరికలను అందుకోనున్నారు. దాంతో ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

