Newly married couple dies of heart attack | పెళ్లైన మరునాడే గుండెపోటుతో యువ జంట మృతి.. ఒకే చితిపై అంత్యక్రియలు
Newly married couple | కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందని పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఏమిటన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
లక్నో: నవ దంపతులు పెళ్లైన మరునాడే గుండెపోటుతో మరణించారు (Newly married couple dies of heart attack). దీంతో ఆ కొత్త జంట మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్పకు మే 30న మంగళవారం రాత్రి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట బుధవారం సాయంత్రం వరుడి ఇంటికి చేరుకున్నారు. నవ దంపతులు ఆ రాత్రికి ఒకే గదిలో కలిసి నిద్రించారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు వారిద్దరూ గది నుంచి బయటకు రాలేదు. అనుమానించిన వరుడి కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. పెళ్లైన కొత్త జంట చనిపోయి ఉండటం చూసి షాక్ అయ్యారు.
కాగా, కుటుంబ సభ్యులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నవ దంపతుల మృతదేహాలను పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరూ గుండెపోటు వల్ల మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు. వారు నిద్రించిన గదిని ఫోరెన్సిక్ నిఫుణులతో పరిశీలించినట్లు చెప్పారు. ఆ జంట శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆ గదిలోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లిన ఆనవాళ్లు లేవన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందన్నారు. దీనికి కారణం ఏమిటన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
మరోవైపు పెళ్లైన మరునాడే గుండెపోటుతో చనిపోయిన నవ దంపతులైన ప్రతాప్, పుష్ఫకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. ఇది చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

