Criminal Laws: కొత్త న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలు
Criminal Laws: భారతీయ శిక్ష్మా స్మృతి(ఐపీసీ) స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ కొత్త న్యాయ చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ న్యాయ స్మృతులకు చెందిన బిల్లులు కూడా ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందాయి. అయితే జూలై ఒకటో తేదీ నుంచి ఆ కొత్త న్యాయ చట్టాలు అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
న్యూఢిల్లీ: భారతీయ శిక్ష్మా స్మృతి(ఐపీసీ) స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ కొత్త న్యాయ చట్టాలను(Criminal Laws) రూపొందించిన విషయం తెలిసిందే. ఆ న్యాయ స్మృతులకు చెందిన బిల్లులు కూడా ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందాయి. అయితే జూలై ఒకటో తేదీ నుంచి ఆ కొత్త న్యాయ చట్టాలు అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత పేరుతో కొత్త చట్టాలను తయారు చేసిన విషయం తెలిసిందే.
ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు బ్రిటిష్ హయాం నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Code of Criminal Procedure), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (Indian Evidence Act) లను కూడా కేంద్రం ఇటీవల రద్దు చేసింది. వాటి స్థానంలో కూడా కొత్త బిల్లులను రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ది భారతీయ న్యాయ సంహిత – 2023 బిల్లును తీసుకొచ్చింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో కొత్త చట్టం కోసం ‘ది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – 2023’ బిల్లును, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టం కోసం ‘ది భారతీయ సాక్ష్య బిల్లు – 2023’ను రూపొందించింది. ఈ మూడు బిల్లులను హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ మూడు బిల్లులో పార్లమెంట్లో పాసయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

