NEET (UG) Examination | మణిపూర్‌లో నీట్ పరీక్ష వాయిదా.. ఈ-మెయిల్స్, ఆటో కాల్స్ ద్వారా విద్యార్థులకు సమాచారం
NEET (UG) Examination | రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల జరుగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. నీట్ (యూజీ) - 2023 (NEET (UG) - 2023) పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి.
ఇంఫాల్: రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల జరుగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. నీట్ (యూజీ) – 2023 (NEET (UG) – 2023) పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యా, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మణిపూర్‌లో ఓ వర్గానికి ఎస్టీ హోదా కల్పించడాన్ని నిరసిస్తూ అక్కడి గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గత మూడు, నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్షను రద్దు చేశారు. సమాచారాన్ని అభ్యర్థులకు ఆటో కాల్స్, ఈ-మెయిల్స్ ద్వారా చేరవేసినట్లు తెలిపారు.
కాగా, దేశంలోని వైద్య విద్యా కోర్సులు పదింటిలో ప్రవేశం కోసం NTA ప్రతి ఏటా కట్టుదిట్టంగా నీట్ పరీక్ష నిర్వహిస్తుంది. పెన్, పేపర్ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. మణిపూర్ మినహా దేశవ్యాప్తంగా రేపు మధ్యాహ్న 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలకు నాలుగేసి మార్కుల చొప్పున 720 మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

