Amit Shah on Hindi | తాను గుజరాతీకంటే హిందీనే ఎక్కువగా ప్రేమిస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. శనివారం ఆయన వారణాసిలో జరిగిన అఖిల భారతీయ రాజ్యభాష సమ్మేళనంలో మాట్లాడుతూ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి హిందీ భాషను ప్రోత్సహించాలన్నారు. భారతీయులంతా రాజ్యభాషను బలోపేతం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలలో మాతృభాషలోనే మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. మన మాతృభాష మనకు గర్వకారణం అని అన్నారు.
పరిపాలనాభాష, స్వభాష, అధికార భాష ఒక్కటైనప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు. స్వాతంత్య్రోద్యమాన్ని గాంధీజీ ప్రజా ఉద్యమంగా మార్చడంలో స్వరాజ్, స్వభాష, స్వదేశీ మూడు స్తంభాలుగా నిలిచాయన్నారు. మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నా స్వదేశీ, స్వభాష దూరం అయ్యాయని చెప్పారు.