Modi and NCC Cadet : ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
Modi and NCC Cadet : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగం అనంతరం చిన్నారులు, పాఠశాల విద్యార్థుల మధ్యకు వెళ్తుంటారు. ఈసారి కూడా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాడెట్లతో...

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగం అనంతరం చిన్నారులు, పాఠశాల విద్యార్థుల మధ్యకు వెళ్తుంటారు. ఈసారి కూడా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాడెట్లతో (Modi and NCC Cadet) చేరడమే కాకుండా.. అడుగు ముందుకేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎర్రకోట ప్రసంగం తర్వాత అక్కడే కూర్చునే పాఠశాల విద్యార్థులను భద్రతా వలయాన్ని ఛేదించుకుని వెళ్లి మరీ మోదీ కలుసుకుంటారు.
కరోనా కారణంగా ఈసారి ఉత్సవాలకు తక్కువ సంఖ్యలో అతిథులను పిలిచారు. ప్రజలు కూడా పలుచగా హాజరయ్యారు. ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాడెట్లు కూడా హాజరయ్యారు. గతంలోమాదిరిగానే ఈసారి కూడా ప్రధాని మోదీ ఎన్సీసీ క్యాడెట్ల మధ్యకు చేరుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్లతో మాట్లాడుతున్న సమయంలో ప్రజాలు నినాదాలు చేయడంతో వారివద్దకు కూడా వెళ్లి అభినందనలు తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్లతో చాలా తక్కువ సమయంపాటు భేటీ అయినప్పటికీ.. ప్రధాని తమ హృదయాలను గెలుచుకున్నారని ఎన్సీసీ క్యాడెట్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తమ మధ్యకు వచ్చి తమను కలుసుకున్నందుకు ఎన్సీసీ క్యాడెట్లు ఆనందపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు టెలివిజన్‌లో తప్ప ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అని, ఊహించలేదని పలువురు అన్నారు.
ప్రధాని మోదీని చాలా దగ్గరగా చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఎన్సీసీ క్యాడెట్ తుషార్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమానికి వస్తానని ఎన్నడూ అనుకోలేదని, ఒక క్షణం మోదీ మాతో వచ్చి కలిసి మా హృదయాలను గెలుచుకున్నాడని తుషార్ అన్నారు. ఎప్పటిలాగే ఎన్సీసీ క్యాడెట్ల వద్దకు ప్రధాని రావడం సంతోషం కలిగించిందని మరో క్యాడెట్ కేశవ్ చెప్పారు. ఇకపై సైనిక్ స్కూళ్లలో అమ్మాయిలకు కూడా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పడం మరో గొప్ప వార్త అని కేశవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియన్స్‌కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్‌లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్‌కు ఐసీసీ మార్గదర్శకాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

