పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
Navjyoth Singh Siddu: పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి

చండీగఢ్: పంజాబ్ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. అయితే, మొన్నటిదాకా పట్టుబట్టి కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేలా చేసిన సిద్ధూ.. ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సిద్ధూ ఆకస్మికంగా రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఇటీవల పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను పదవి నుంచి దించడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ సిద్ధూ పావులు కదిపారు. చివరకు అధిష్ఠానాన్ని ఒప్పించి అమరీందర్‌ను గద్దె దించేందుకు ప్లాన్ చేశారు. అయితే ముందే ఈ విషయాన్ని పసిగట్టిన అమరీందర్ సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత చరణ్జీత్సింగ్ను నూతన ముఖ్యమంత్రిగా నియమించడం, కొత్తమంత్రివర్గం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సిద్ధూ పీసీసీ చీఫ్ పదవిలోకి వచ్చిన 72 గంటలకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

