నేషనల్ హెరాల్డ్ కేసు : ఈడీ కార్యాలయానికి చేరుకున్న మల్లికార్జున్ ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి ఈడీ సీల్ వేసిన అనంతరం కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం దర్యాప్తు ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు.
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి ఈడీ సీల్ వేసిన అనంతరం కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం దర్యాప్తు ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేసింది.
ఢిల్లీలో కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ కార్యాలయ భవనంలో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి ఈడీ అధికారులు బుధవారం సీల్ వేసిన సంగతి తెలిసిందే. కార్యాలయంలో సోదాల సందర్భంగా అక్కడికి మల్లికార్జున్ ఖర్గే వచ్చినా ఆపై వెనుదిరగడంతో కార్యాలయానికి సీల్ వేశామని ఈడీ అధికారులు చెప్పారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు బీజేపీ అణిచివేత ఎత్తుగడల్లో భాగమని, కాషాయ పార్టీకి తాము భయపడబోమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసినా తాము బెదిరేది లేదని అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తన పోరాటం కొనసాగుతుందని గురువారం పేర్కొన్నారు. తమపై ఒత్తిడి తీసుకువస్తే మౌనం దాల్చుతామని కాషాయ పాలకులు అనుకుంటున్నారని, తాము మౌనం దాల్చబోమని బీజేపీ దుర్నీతిని ఎండగడుతూనే ఉంటామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

