నలంద వర్సిటీ.. పీజీ కోర్సులకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం

పాట్నా : నలంద విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో(2021) ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశ ప్రక్రియ కోసం nalandauniv.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (SoP), స్వీయ పరిచయ నోట్తో పాటు సమర్పించాలి. వర్సిటీ విడుదల చేసిన ప్రవేశ మార్గదర్శకాల ప్రకారం.. అన్ని కోర్సులు ఇంగ్లీష్లోనే ఉంటాయి కావునా అభ్యర్థులు ఆంగ్ల భాషలో ఉన్నతస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. TOEFL, IELTS, TOEIC, PTE, STEP ఆంగ్ల భాషా పరీక్ష స్కోర్లు అంగీకరించబడతాయి.
దరఖాస్తు ప్రక్రియ..
భారతీయ పౌరులు అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫారం, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ) ను admissions2021@nalandauniv.edu.in. కు సమర్పించాలి. దరఖాస్తు రుసుము రూ. 500. దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత లావాదేవీ ఐడీ లేదా బదిలీ వివరాలను admissions2021@nalandauniv.edu.in వద్ద అడ్మిషన్స్ కార్యాలయానికి సమర్పించాలి. తెలియజేసిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అదే విదేశీ విద్యార్థులు నింపిన దరఖాస్తు ఫారం, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ) తో పాటు సంబంధిత అన్ని పత్రాలను foreignstudents@nalandauniv.edu.in కు పంపాలి. అభ్యర్థి ఫీజు 8 డాలర్లుగా ఉంది.
మాస్టర్స్ కార్యక్రమానికి అర్హత ప్రమాణాలు..
- అభ్యర్థి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా 2.2 / 4.0 జీపీఏ లేదా సమానమైన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించి ఉండాలి.
- అభ్యర్థులు సెల్ఫ్ ఇంట్రడక్షన్ / బయో నోట్ స్టేట్మెంట్ (250 పదాలకు మించకూడదు) సమర్పించాలి
- అభ్యర్థులు ఈ క్రింది వాటిపై స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (SoP) ను సమర్పించాల్సి ఉంటుంది. మీరు నలంద విశ్వవిద్యాలయంలో ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారు (100 పదాలు). ఈ ప్రోగ్రామ్ ఎంచుకోవడానికి గల కారణాలు (300– 500 పదాలు).
- ఇతర దేశాల నుండి వచ్చే విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రావీణ్యం రుజువు అవసరం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | టీవీకే ఎమ్మెల్యే మరణంతో కొలత్తూరులో ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ పోటీ చేస్తారా..?
Allu Arjun | కూతురితో సరదాగా .. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్!
Haindava | బెల్లంకొండ ‘హైందవ’ విడుదలకు బ్రేక్.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్న మేకర్స్!
Allu Arjun | నా జీవితపు ఆనందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ముద్దుల కూతురు అర్హపై అల్లు అర్జున్ క్యూట్ పోస్ట్!
Diabetes | డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు.. మూడింటికీ ఏంటి సంబంధం..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

