కరోనా, బ్లాక్ ఫంగస్‌తోపాటు అవయవాల వైఫల్యంపై పోరాడిన ముంబై వ్యక్తి

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఒక వ్యక్తి కరోనాతోపాటు అనంతరం తలెత్తిన బ్లాక్ ఫంగస్, అవయవాల వైఫల్యంపై పోరాడారు. సుమారు మూడు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. 54 ఏండ్ల భరత్ పంచల్‌కు కరోనా తొలి డోసు టీకా తీసుకున్న రెండు వారాలకు జ్వరం వచ్చింది. పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అనంతరం వారం రోజులకు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. సిటీ స్కాన్‌లో వ్యాధి తీవ్రత 25కు 21గా ఉన్నది. హిరానందాని హాస్పిటల్లో అడ్మిట్ అయిన పంచల్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతోపాటు ఇతర అవయవాల్లో సమస్యలు తలెత్తాయి.
కరోనా రోగులు ఎదుర్కొనే బ్లాక్ ఫంగస్‌తోపాటు మూత్రపిండాలు, కాలేయం, సెప్సిస్ వంటి మల్టీ ఆర్గాన్ వైఫల్యాలపై పంచల్ పోరాడారు. ప్లాస్మా థెరపీ నుంచి అందుబాటులో ఉన్న అన్ని వైద్య చికిత్సలను డాక్టర్లు అందించారు. చివరకు ఊపిరితిత్తుల నుంచి రక్తం కారడంతో అతడు బతకడం కష్టమని భావించి కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. అయితే 70 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉన్న పంచల్ అన్ని అనారోగ్య సమస్యలను జయించారు. 85 రోజుల తర్వాత సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరారు. గత 15 నెలల్లో ఎవరూ కూడా ఇంత సుదీర్ఘంగా ఆసుపత్రిలో చికిత్స పొందలేదని హిరానందాని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

