ముంబై: ఒక రౌడీ షీటర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక గుంపు ఆ పోలీసులపై దాడి చేసింది. (cops attacked by mob) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 10న పోలీస్ అధికారులుగా నమ్మించిన కొందరు పలువురిని మోసగించి డబ్బులు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒక వ్యక్తిని ఫిరోజ్ ఖాన్‌గా గుర్తించారు. అతడిపై అప్పటికే 35 క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుసుకున్నారు. ఆ నేరస్తుడి కోసం పోలీసులు వెతికారు.
కాగా, మంగళవారం ముంబై అంబివాలి ప్రాంతంలోని ఇరానీ బస్తీలో ఒక సెలూన్లో ఫిరోజ్ ఖాన్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక వాహనంలో అక్కడకు చేరుకున్నాడు. ఆ రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఇంతలో కొందరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టారు. రాళ్లు విసిరి దాడి చేశారు. అయితే పోలీసులు నిందితుడితో సహా ఆ ప్రాంతం నుంచి వాహనంలో వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://embed.indiatoday.in/share/video/embed/9311