ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి వసూళ్ల ముఠా నడిపిన సచిన్ వాజే

న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో అరెస్టు అయిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే.. ముంబైలో ఓ వసూళ్ల ముఠాను నడిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచారణలో తేల్చింది. నారీమన్ పాయింట్ వద్ద ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ నుంచి ఆ దందా సాగించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 12 లక్షల కిరాయితో వంద రోజుల పాటు సచిన్ వాజే పేరిట ఆ రూమ్‌ను బుక్ చేసినట్లు విచారణలో తేల్చారు. అయితే ఓ వ్యాపారవేత్త పేరిట ఆ రూమ్‌ను బుక్ చేసినట్లు తెలిపారు. స్టార్ హోటల్లో ఉన్న రూమ్‌కు వచ్చేందుకు ఇన్స్పెక్టర్ వాజే ఫేక్ ఐడెంటిటీ వాడేవారని తేల్చారు. సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.
స్టార్ హోటల్లోని రూమ్ నెంబర్ 1964 నుంచి సచిన్ వాజే ఆపరేట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నకిలీ ఆధార్ కార్డుతో అతను రూమ్‌లోకి ఎంటరైనట్లు తెలిపారు. సుశాంత్ సదాశివ్ ఖామ్కర్ పేరుతో అతను రూమ్‌కి వచ్చేవాడు. క్రైం బ్రాంచ్‌లో రిపోర్ట్ చేస్తూ ఫిబ్రవరి వరకు కూడా సచిన్ వాజే విధులకు హాజరైనట్లు గుర్తించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఇన్నోవా వాహనంలో హోటల్‌కు వచ్చిన సచిన్ వాజే.. ఆ తర్వాత 20వ తేదీన ల్యాండ్ క్రూయిజర్‌లో బయటికి వెళ్లారు. ఆ రెండు వాహనాలను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. హోటల్ రూమ్‌లో ఉంటూ సమీపంలో ఉన్న రెస్టారెంట్లపై లైసెన్సు పేరుతో రాత్రి పూట విచారణకు హాజరయ్యేవాడు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరం బీర్ సింగ్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

