Blasts | పాకిస్తాన్ దాడులు.. శ్రీనగర్, చండీగఢ్‌లో వరుస పేలుళ్లు..!
Blasts | శ్రీనగర్, చండీగఢ్‌పై పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. శనివారం వేకువ జామున వరుస పేలుళ్లు సంభవించాయి. శుక్రవారం రాత్రి నుంచి శ్రీనగర్ విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించింది.
Blasts | శ్రీనగర్, చండీగఢ్‌పై పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడింది. శనివారం వేకువ జామున వరుస పేలుళ్లు సంభవించాయి. శుక్రవారం రాత్రి నుంచి శ్రీనగర్ విమానాశ్రయం సహా అనేక ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. అయితే, విమానాశ్రయం సహా కీలకమైన స్థావరాల సమీపంలో పేలుడు జరిగినట్లు శబ్దాలు వచ్చాయని అధికారులు తెలిపారు. పేలుడు శబ్దాలు వినిపించిన వెంటనే నగరంలో సైరన్లు మోగాయని పేర్కొన్నారు. పేలుళ్ల నేపథ్యంలో లోయలోని చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అమలులో ఉందని చెప్పారు.
శనివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఉదయం 5 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించాయని పీటీఐ పేర్కొంది. అయితే, దీనిపై అధికారులు మాత్రం స్పందించలేదు. శుక్రవారం రాత్రి పఠాన్‌కోట్‌లో అధికారులు బ్లాక్అవుట్ విధించారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని కోరారు. శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్ జిల్లాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా.. అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిరోజ్పూర్లో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్ ఖై ఫెమే కే గ్రామంలోని ఓ ఇంటిపై పడిపోయిందని ఇళ్లు కారు మంటల్లో చిక్కుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

