Radhika-Anant ceremony | గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 3వ తేదీన అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అతిథులు.. ఈ జంటను ఆశీర్వదించారు.
అయితే హస్తక్షర్ వేడుక సందర్భంగా రాధిక మర్చంట్.. అనంత్ అంబానీకి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. రాధిక భావోద్వేగాన్ని చూసిన ముకేశ్ అంబానీ కూడా ఎమోషనల్‌కు గురయ్యారు. ముకేశ్‌ను గమనించిన భార్య నీతా అంబానీ అతన్ని హగ్ చేసుకున్నారు.
ఇక అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌కు స్వాగతం పలికి.. కౌగిలించుకున్నారు. ఆ తర్వాత నుదుటిపై ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు అనంత్. అక్కడున్న అతిథులంతా చప్పట్లతో ఆ నూతన జంటకు స్వాగతం పలికారు. రాధిక.. అనంత్ దగ్గరకు నడుచుకుంటూ వస్తున్న సమయంలో, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘దేఖా తేను పెహ్లీ పెహ్లీ బార్ వే’ అనే పాట ప్లే అయింది. ఆ పాటకు అనుగుణంగా రాధిక నృత్యం చేస్తూ ఎమోషన్‌కు గురయ్యారు. అనంతరం హస్తక్షర్ కార్యక్రమం జరిగింది.
ముకేశ్ అంబానీ, రాధిక మర్చంట్ ఎమోషన్‌కు సంబంధించిన వీడియోను కరణ్ జోహర్ ఈ నెల 6న తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు. అనంత్ – రాధిక జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కరణ్ జోహర్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.