న్యూఢిల్లీ : ఇటీవల విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న భారత్కు చెందిన హర్నాజ్ కౌర్ సంధును ప్రముఖ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అభినందించారు. ఆమెను కలిసిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. ‘హర్నాజ్ను అభినందించడం ఆనందంగా ఉంది. మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు విజయోత్సాహంతో న్యూ ఇయర్ సెలవుల కోసం దేశానికి తిరిగి వచ్చినందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఆమెను స్వాగతిస్తున్నందుకు నిస్సందేహంగా దేశానికి గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.
Delighted to congratulate Miss Universe @HarnaazKaur Sandhu in person on her triumphant return to India. She’s excited to be back in India for the New Year holidays & India, of course, is proud to welcome her. She’s just as poised & charming in person as on the stage. pic.twitter.com/OBj0KeTkoQ
— Shashi Tharoor (@ShashiTharoor) December 15, 2021
ఈ సందర్భంగా పలువురు యూజర్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ‘రాజకీయాల్లో రణబీర్ కపూర్ నువ్వే’ అంటూ తరుణ్ జోషి అనే యూజర్ ట్వీట్ చేశాడు. ‘నేను అమ్మాయిని.. పోరాడగలను, ప్రచారాన్ని హర్నాజ్ బెస్ట్’ అని మరో యూజర్ పోస్ట్ పెట్టాడు. ‘గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కోసం దయచేసి మెసేజ్ చేయండి సర్’ అంటూ సత్రేంద్ర సింగ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. రామానుజన్ అవార్డు గెలుచుకున్న గణిత శాస్త్రవేత్త నీనాగుప్తాకు శశిథరూర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేస్తారా? అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.
Sir ek massage group captain Varun Singh ke liye kijiye pls…….
— Satyendra Singh (@satyend88611388) December 15, 2021