Farmers died : రైతులపైకి దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కొడుకు కారు, ఇద్దరు మృతి
Farmers died : కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. పలువురు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖిమ్‌పూర్ ఖేరీలో ..

లక్నో : (Farmers died) కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. పలువురు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖిమ్‌పూర్ ఖేరీలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కేంద్ర మంత్రి కుమారుడ్ని అదుపులోకి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన కారుతోపాటు మరో రెండు కార్లకు ఆందోళనాకారులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖిమ్‌పూర్ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలుపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ కారు రైతులపైకి దూసుకొచ్చింది. అందరు చూస్తుండగానే రైతులను గుద్దుకుంటూ వెళ్లిపొయింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆశీష్ మిశ్రా కారుతో పాటు మరో రెండు కార్లకు నిప్పు పెట్టారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీష్ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు స్వాగతం పలికి తీసుకొచ్చేందుకు ఆశీష్ మిశ్రా వెళ్తున్నట్లుగా సమాచారం. ముగ్గురు రైతులు చనిపోయినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటూ రైతులు ఇంకా ఆందోళన కొనసాగిస్తుండటంతో పరిస్తితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అదనపు డీజీపీ ప్రశాంత్‌కుమార్‌ను లఖిమ్‌పూర్ ఖేరీకి వెళ్లి పరిస్థితి సద్దుమణిగేలా చూడాలని ఆదేశించారు. పలువురు ఉన్నతాధికారులు లఖిమ్‌పూర్ ఖేరీలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు డీజీపీ ముకుల్ గోయల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఈ గాజు మహా బలమైనది.. ఫోన్ స్క్రీన్లుగా వస్తే పగిలే సమస్య ఉండదంట!
సరిహద్దులో తాలిబాన్ ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్
ప్రపంచ ఫార్మసీగా భారత్ అవతరణ : సౌమ్య స్వామినాథన్
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
భారత్‌లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఈశాన్యంలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు
తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్‌లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

