Soumya Swaminathan : ప్రపంచ ఫార్మసీగా భారత్ అవతరణ : సౌమ్య స్వామినాథన్
Soumya Swaminathan : భారతదేశం ప్రపంచ ఫార్మసీగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇలా అవతరించడం...

న్యూఢిల్లీ : (Soumya Swaminathan) భారతదేశం ప్రపంచ ఫార్మసీగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇలా అవతరించడం గత 75 ఏండ్లలో ఆ దేశం సాధించిన విజయాల్లో ఇది అతి పెద్ద విజయమని అన్నారు. ఆరోగ్య సేవల పంపిణీపై భారత్ సహా అన్ని దేశాల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్ ప్రభావం చూపిందని చెప్పారు. ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ నిర్వహించిన ‘స్వస్త్ భారత్.. సంపన్న్ భారత్’ కార్యక్రమంలో ఆమె టెలిథాన్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.
పోలియో నిర్మూలన మొదలు అనేక వ్యాక్సిన్లను తీసుకురావడం, మాతాశిశు మరణాలను తగ్గించడం వరకు భాతరదేశం ప్రపంచ ఫార్మసీ వేదికగా నిలిచిందని సౌమ్య స్వామినాథన్ అన్నారు. గత ఏడాదిన్నర క్రితం వ్యాప్తి చెందిన కొవిడ్-19 ఇన్ఫెక్షన్ భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఆరోగ్య సేవలను అందించడం కొంత ఇబ్బందిగా మారిందని అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా టీబీ, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ప్రసూతి, చిన్నపిల్లల ఆరోగ్య సేవలను అందించడంలో ఇబ్బంది కలిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత శ్రద్ధ వహించి వీటిపై దృష్టిసారించాలని సూచించారు.
భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగనున్నాయని, రాజీలేకుండా వీటిని ఎదుర్కోవడంలో ముందుండాలని పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా పలు దేశాల్లో పేదరికం పెరిగిందని, ఫలితంగా పోషకాహార లోపంతో బాధపడే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ మనం నిశితంగా గమనిస్తూ ముందస్తు చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
భారత్‌లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఈశాన్యంలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు
తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్‌లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

