Mortar Shell | ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వెలుపల పడి పేలిన మోర్టార్ షెల్.. ముగ్గురు మృతి
Mortar Shell | బుధవారం తెల్లవారుజామున ఆర్మీ ఫైరింగ్ రేంజ్ బయట ఒక మోర్టార్ షెల్ (Mortar Shell) పడింది. అది పేలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
పాట్నా: ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వెలుపల ఒక మోర్టార్ షెల్ (Mortar Shell) పడింది. అది పేలడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బీహార్లోని గయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బారచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులార్వేడ్ గ్రామం పరిధిలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఉంది. అయితే బుధవారం తెల్లవారుజామున ఆ ఫైరింగ్ రేంజ్ బయట ఒక మోర్టార్ షెల్ పడింది. అది పేలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని అనుగ్రహ నారాయణ్ మగద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు గ్రామస్తులు మరణించారు.
కాగా, మోర్టార్ షెల్ పేలుడు వల్ల తీవ్రంగా గాయపడి మరణించిన ముగ్గురు గ్రామస్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో మహిళతోపాటు ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు గయా ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వెలుపల మోర్టార్ షెల్ ఎలా పడి పేలింది అన్న దానిపై పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు.
Women’s Day: మహిళా దినోత్సవం రోజున.. నల్ల రిబ్బన్లు ధరించిన మహిళా ప్రయాణికులు, ఎందుకంటే?
Viral Video | డ్యాన్సర్పై డబ్బు వెదజల్లిన కాంగ్రెస్ కార్యకర్త
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

