National Voter’s Day: దేశంలో 95.3 కోట్లకుపైగా ఓటర్లు: సీఈసీ
National Voter's Day: దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్‌చంద్ర అన్నారు. ఇవాళ జరిగిన నేషనల్ ఓటర్స్ డే

న్యూఢిల్లీ: దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్‌చంద్ర అన్నారు. ఇవాళ జరిగిన నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొత్తం ఓటర్లలో 49 కోట్ల మంది పురుషులు, 46 కోట్ల మంది మహిళలు ఉన్నారని ఆయన చెప్పారు. మరో 1.92 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు (60 ఏండ్లు పైబడినవారు) ఉన్నారని సీఈసీ వెల్లడించారు.
దేశానికి స్వాతంత్రవచ్చిన నాటి నుంచి భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తూ వస్తున్నారని సీఈసీ సుశీల్ చంద్ర చెప్పారు. కేవలం 18 శాతం అక్షరాస్యత ఉంది, కొత్తగా స్వాతంత్య్రం సాధించుకున్న దేశం వేగవంతమైన అభివృద్ధికి ఈ రైట్ టు ఓట్ ఎంతో తోడ్పడిందని ఆయన చెప్పారు.
ఇక, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని సుశీల్ చంద్ర తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తిచేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

