మందు మరిగిన మర్కటాలు
దుకాణం ఎప్పుడు తెరుస్తారా! అని ఎదురుచూడటం.. ఎవరైనా అందులోంచి సరుకు తీసుకొని బయటకు రాగానే మీద ఎగబడి తస్కరించటం.. చటుక్కున చెట్టో.. గోడనో ఎక్కి గటగటా తాగేయటం
- ఉత్తరప్రదేశ్‌లో బెంబేలెత్తుతున్న మందుబాబులు
రాయ్‌బరేలీ: దుకాణం ఎప్పుడు తెరుస్తారా! అని ఎదురుచూడటం.. ఎవరైనా అందులోంచి సరుకు తీసుకొని బయటకు రాగానే మీద ఎగబడి తస్కరించటం.. చటుక్కున చెట్టో.. గోడనో ఎక్కి గటగటా తాగేయటం.. ఏంది..? సరుకేమిటి? దుకాణం ఏమిటి? తాగేయటం ఏమిటి? అనుకొంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఉత్తరప్రదేశ్‌లో మర్కటాలకు మంచినీళ్లు అస్సలు నచ్చటం లేదట.. అందుకే సీసాలకు సీసాలు బీర్లు లాగించేస్తున్నాయి. ఈ తాగుబోతు కోతుల దెబ్బకు రాయ్‌బరేలీ పట్టణంలో మందుబాబులు ఠారెత్తిపోతున్నారట. వైన్‌షాప్ నుంచి బీర్ కొనుక్కొని బయటకు రావటమే ఆలస్యం.. మీద కలబడి సీసాలు లాక్కొని పారిపోతున్నదట ఓ తాగుబోతు కోతి. మందుబాబులు ఎదిరిస్తే దాడి చేసి గాయపరుస్తున్నదట. కొన్నిసార్లు వైన్‌షాపులకు కూడా కన్నాలేసి మందు తస్కరిస్తున్నదట. ఓ తాగుబోతు మర్కటం బీర్‌బాటిల్ అమాంతం ఎత్తి గటగటా తాగేస్తున్న వీడియో వైరల్ అవుతున్నది. దానిని బంధించేందుకు అటవీశాఖ సహాయం తీసుకొంటున్నట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

